Ananya Nagalla: నేను గ్లామర్ ఫొటోలు షేర్ చేయడానికి కారణం ఇదే: అనన్య నాగళ్ల

Actress Ananya Nagalla reveals the reason of sharing glamour pics
  • సినీ ఫీల్డ్ లో ఉండాలంటే అన్ని రకాలుగా కనిపించాలన్న అనన్య
  • అందుకే గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తున్నానని వెల్లడి
  • తను నటించిన కమర్షియల్ చిత్రాలు వర్కవుట్ కాలేదని వ్యాఖ్య
ఇటీవలి కాలంలో టాలీవుడ్ కు పరిచయమైన తెలుగు అమ్మాయిల్లో అనన్య నాగళ్ల ఒకరు. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ఆమె తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనన్య... తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. 

ఈ ఫొటోలపై తాజాగా ఆమె స్పందిస్తూ... 'శాకుంతలం' సినిమాలో నటించేటప్పుడు కొన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేశానని చెప్పింది. ఆ ఫొటోలకే చాలా రెస్పాన్స్ వచ్చిందని వెల్లడించింది. ఇలాంటి ఫొటోలను షేర్ చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదని... సినీ ఫీల్డ్ లో ఉండాలంటే అన్ని రకాలుగా కనిపించాలని తెలిపింది. అందుకే గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తున్నానని చెప్పింది. తనకు కొన్ని కమర్షియల్ అవకాశాలు వచ్చినప్పటికీ... అవి వర్కవుట్ కాలేదని తెలిపింది. సినిమాల విషయానికి వస్తే అనన్య నటించిన తాజా చిత్రం 'అన్వేషి' ఈ నెల 17న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు వీజే ఖన్నా తెరకెక్కించారు.
Ananya Nagalla
Tollywood
Glamour

More Telugu News