మహేశ్ బాబు 'గుంటూరు కారం' నుంచి ఫస్ట్ సింగిల్... ప్రోమో ఇదిగో!
- మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం
- తొలి సింగిల్ 'దమ్ మసాలా' విడుదలకు సన్నాహాలు
- నవంబరు 7న పూర్తి లిరికల్ వీడియో విడుదల
"దమ్ మసాలా బిర్యానీ... గుద్దిపారేయ్ గుంటూర్నీ" అంటూ ఎనర్జటిక్ గా సాగే ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న 'గుంటూరు కారం' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు.