Ysrcp: పురంధేశ్వరి ఏ ఎండకా గొడుగు పట్టే రకం.. విజయసాయి రెడ్డి ఫైర్

YCP Leader VijayaSai Reddy Fires On Purandheswari
  • టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారని విమర్శ
  • తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి పదవులు అనుభవించిందని మండిపాటు
  • ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అంటూ వ్యంగ్యం

ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగారని, చంద్రబాబు పార్టీ నుంచి గెంటేస్తే కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు.

తన తండ్రిని అవమానించిన పార్టీ అంటూ అప్పటి వరకూ విమర్శించిన అదే కాంగ్రెస్ లో చేరి, నిస్సిగ్గుగా పదవులు చేపట్టారని అన్నారు. తండ్రిని అవమానించి, ఆ పునాదులపై ఏర్పాటైన టీడీపీలో అధికారం ఉన్నంతకాలం ఉన్న నీతిలేని చరిత్ర ఆమెదని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అని పురంధేశ్వరిపై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News