Babar Azam: బాబర్ అజాం పెళ్లి షాపింగ్.. 7 లక్షలతో షేర్వాణీ కొనుగోలు

Babar Azams Buys Rs 7 Lakh Sherwani For His Wedding
  • న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం కోల్ కతాకు వచ్చిన బాబర్ సేన
  • ఒకరోజు టైం ఉండడంతో పెళ్లి షాపింగ్ చేసిన బాబర్
  • కీలకమైన టోర్నీ జరుగుతుంటే బాబర్ షాపింగ్ చేయడంపై విమర్శలు
వరల్డ్ కప్ టోర్నీలో పేలవమైన ప్రదర్శనతో ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ జట్టును మరో వివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే ఆటగాళ్ల తిండిపై పాక్ మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ అజాంపై మరోమారు నెటిజన్లు మండిపడుతున్నారు. కీలకమైన టోర్నీ జరుగుతుంటే బాబర్ అజాం పెళ్లి షాపింగ్ చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఓవైపు జట్టు వరుసగా అన్ని మ్యాచ్ లలో ఓడిపోతుంటే కెప్టెన్ దృష్టి మొత్తం వచ్చే నెలలో జరగాల్సిన తన పెళ్లిపైనే ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..
న్యూజిలాండ్ తో ఆడాల్సిన మ్యాచ్ కోసం బాబర్ సేన ఒక రోజు ముందే కోల్ కతా చేరుకుంది. మ్యాచ్ కు సమయం ఉండడంతో జట్టు ప్రాక్టీస్ లో చెమటోడుస్తుందని పాకిస్థాన్ అభిమానులు భావించారు. అయితే, బాబర్ మాత్రం కోల్ కతాలో షాపింగ్ చేశాడు. వచ్చే నెలలో బాబర్ పెళ్లి జరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం ఇండియా వచ్చిన బాబర్.. పనిలో పనిగా తన పెళ్లి షాపింగ్ కూడా చేశాడు. కోల్ కతాలోని ఓ డిజైనర్ షాప్ లో రూ.7 లక్షలు వెచ్చించి షేర్వాణీ కొనుగోలు చేశాడు. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Babar Azam
Cricket
world cup 2023
Pakistan
wedding shopping
7 lakh Sherwani

More Telugu News