విజయసాయిరెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిన పురందేశ్వరి
- బెయిల్ పై ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని పురందేశ్వరి ఫిర్యాదు
- 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని పేర్కొన్న వైనం
- తక్షణమే బెయిల్ రద్దు చేయాలని విన్నపం
ఇప్పటికే విజయసాయిపై 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని పురందేశ్వరి తెలిపారు. పదేళ్లుగా బెయిల్ పై బయట ఉంటూ... సీబీఐ, ఈడీ కేసుల్లోని షరతులను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా నిరోధిస్తున్నారని తెలిపారు. పదేపదే వాయిదాలు కోరుతూ విచారణ కొనసాగకుండా అడ్డుకుంటున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. విజయసాయి బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని సీజేఐని కోరారు. విజయసాయిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.