తాజ్‌మహల్‌పై హిందూ సేన పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
- తాజ్‌మహల్‌ను షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన్ ఢిల్లీ హైకోర్టులో పిల్
- రాజా మాన్ సింగ్ ప్యాలెస్‌కు మార్పులు చేసి తాజ్‌మహల్‌ను సిద్ధం చేశారని వెల్లడి
- ఈ విషయంపై ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దృష్టి సారించాలన్న కోర్టు
ఈ పిటిషన్‌పై జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ తుషార్ గెడెలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హిందూ సేన ఇదే తరహా పిటిషన్‌తో గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైనాన్ని ప్రస్తావించింది. కానీ, ఈ విషయంలో ఏఎస్ఐ ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంపై దృష్టిసారించాలని తాజాగా ఏఎస్ఐని కోరింది. కాగా, తాజ్‌మహల్ వయసు ఎంతో కూడా నిర్ధారించేందుకు ఏఎస్ఐ పరీక్షలు నిర్వహించాలని హిందూ సేన తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. తాజ్‌మహల్ విషయంలో తాము లోతైన అధ్యయనం చేశామని, చరిత్ర పుస్తకాల్లో ఈ విషయమై ఉన్న తప్పులు సరిదిద్ది ప్రజలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని అభిప్రాయపడింది. రాజా మాన్ సింగ్ ప్యాలెస్‌ను కూల్చి మొఘలులు తాజ్‌మహల్ కట్టారనడానికి ఆధారాలు లేవని కూడా పేర్కొంది.