Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్

  • 8 క్యాలెండర్ ఇయర్లలో జరిగిన వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన విరాట్
  • సచిన్ ఏడు సార్లు ఈ ఘనత సాధించిన వైనం
  • శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ రికార్డు అధిగమించిన కోహ్లీ
Virat Kohli Makes History Shatters Sachin Tendulkars World Record In ODI Cricket

నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఎనిమిది క్యాలెండర్ సంవత్సరాల్లో జరిగిన వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు స‌ృష్టించాడు. సచిన్ తన వన్డే కెరీర్‌లో ఏడు క్యాలెండర్ ఇయర్లలో వెయ్యికి పైగా పరుగులు నమోదు చేశాడు. శ్రీలంక మ్యాచ్‌లో మరోసారి బ్యాట్ ఝళిపించిన కోహ్లీ సచిన్ రికార్డును అధిగమించాడు. 

ఇప్పటివరకూ ఉన్న రికార్డు ఇవే..

  • విరాట్ కోహ్లీ 2011-14 మధ్య, 2017-19 మధ్య, ఈ ఏడాది కలిసి మొత్తం 8 మార్లు వన్డేల్లో వెయ్యికిపైగా పరుగులు చేశాడు.
  • సచిన్ 1994లో, 1996-98 మధ్య, 2000, 2003, 2007లో వన్డేల్లో వెయ్యికిపైగా పరుగులు చేశాడు.

కాగా, శ్రీలంకపై విజయంతో భారత్ వరల్డ్ కప్‌లో సెమీస్‌లో కాలుపెట్టిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. షమీ, సిరాజ్ దూకుడుకు శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలడంతో భారత్ విజయం నల్లేరుమీద నడకే అయ్యింది.

More Telugu News