Anand Mahindra: శ్రీలంకపై భారత్ విజయం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర కామెంట్స్

Reign of terror Anand Mahindra on Indias pacers in match against Sri Lanka
  • భారత్ బౌలర్ల భీకర బౌలింగ్‌కు ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
  • వెస్టిండీస్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడూ ఈ స్థాయి దాడి చూడలేదని వ్యాఖ్య
  • మ్యాచ్‌ ముగిసి శ్రీలంక ఇక్కట్లు తీరినందుకు సంతోషించానని కామెంట్
నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయం ప్రతి భారతీయుడినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. ముఖ్యంగా షమీ, సిరాజ్ బౌలింగ్ ధాటికి శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిన తీరు చూసి నోరెళ్లబెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. సిరాజ్ తన తొలి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు తీయగా షమీ కేవలం ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి శ్రీలంక కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో సెమీస్‌లో కాలుపెట్టిన తొలి టీంగా భారత్ నిలిచింది.  

కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత బౌలర్లు శ్రీలంకను భయభ్రాంతులకు గురిచేశారని వ్యాఖ్యానించారు. ‘‘వెస్టిండీస్ టీం ఉచ్ఛస్థితిలో ఉన్న రోజుల్లోనూ వారి బౌలర్లు ప్రత్యర్థి టీం వికెట్లు ఈ రీతిలో కూల్చారని నేను అనుకోను. మనోళ్లు నిజంగా శ్రీలంకకు భయానకవాతావరణం సృష్టించారు. మ్యాచ్‌ ముగియడంతో శ్రీలంక ఇక్కట్లు తీరినందుకు నేనైతే సంతోషించా’’ అని ఆయన కామెంట్ చేశారు.
Anand Mahindra
Sri Lanka
India

More Telugu News