Chandrababu: డాక్టర్ల సూచనతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన చంద్రబాబు

Chandrababu joins AIG hospital in Hyderabad
  • నిన్న హైదరాబాదులోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు
  • చంద్రబాబును ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఏఐజీ బృందం
  • వైద్య పరీక్షలు చేయించుకోవాలన్న డాక్టర్లు
  • ఈ ఉదయం వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు
  • మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు... ఆసుపత్రిలో చేరాలని సూచన

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాదులోని ఏఐజీ (ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) ఆసుపత్రిలో చేరారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం విడుదలైన చంద్రబాబు నిన్న హైదరాబాదులోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను ఏఐజీ వైద్యుల బృందం కలిసి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసింది. ఓసారి ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబుకు డాక్టర్లు సూచించారు. దాంతో, ఈ ఉదయం ఆయన ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు... ఆయన ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని తెలిపారు. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.

స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నవంబరు 28న తిరిగి జైలుకు రావాల్సి ఉంటుందని హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News