రేపు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్... రేపటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
- 13వ తేదీ వరకు నామినేషన్‌ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 15
- ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
సీఈసీ వీడియో సమావేశం
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో సమావేశం నిర్వహించింది. అంతర్రాష్ట్ర సరిహద్దు అంశాలపై ఢిల్లీ నుంచి సీఈసీ సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దు అంశాలపై సమీక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు పాల్గొన్నారు.