Puducherry: ఎర్రగా మారిన సముద్రం నీరు.. పుదుచ్చేరిలో టెన్షన్!

Sea water turn red near puducherry beach causing panic among locals
  • అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు, పర్యాటకులు 
  • రంగు మారిన నీటి శాంపిల్స్ ల్యాబ్‌కు తరలింపు 
  • నీటిలో ఆల్గే కారణంగా రంగు మార్పునకు అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు

పుదుచ్చేరి వద్ద సముద్రం నీరు ఎర్రని రంగులోకి మారడం స్థానికులు, పర్యాటకులకు ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగైదు రోజులుగా సముద్రపు నీటిలో రంగుమార్పుతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎందుకిలా జరుగుతోందో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు. ఈ మార్పులపై కొందరు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు రంగు మారిన సముద్రపు నీటి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. 

ఇటీవల విశాఖపట్నం బీచ్‌ వద్ద కూడా సముద్రపు నీరు నల్లగా మారడంతో కలకలం రేగింది. తమిళనాడులోని పలు బీచ్‌ల్లోనూ సముద్రపు నీటి రంగు మారడం చర్చనీయాంశంగా మారింది.  

నీటిలో ఆల్గే వంటి సూక్ష్మజీవులు ఉన్నా లేక ఇతర పదార్థాలు ఉన్నా రంగు మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కూడా సముద్రపు నీటి రంగు మారే అవకాశం ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.

  • Loading...

More Telugu News