Varun Tej: వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

Varun Tej and Lavanya Tripathi are united in marriage
  • ఇటలీలో సందడిగా జరిగిన పెళ్లి వేడుకలు
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ
  • నవంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్

నటుడు వరుణ్ తేజ్ - నటి లావణ్య త్రిపాఠి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాడు. దీంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఘనంగా జరిగిన పెళ్లి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు చెందిన అగ్ర హీరోలు సందడి చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నవ దంపతులను ఆశీర్వదించారు.

కాగా.. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. అభిరుచులు కలవడంతో స్నేహం ప్రేమగా మారిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తమ ప్రేమకథను పంచుకున్న విషయం తెలిసిందే. 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలో కూడా కలిసి నటించడంతో స్నేహం కాస్త ఇష్టంగా మారింది. ఇక సినిమా పరిశ్రమ, సెలబ్రిటీల కోసం నవంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకున్నారు. మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా ఈ వేడుక జరగనుంది.

  • Loading...

More Telugu News