kotha prabhakar reddy: సెన్సేషన్ కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడు: సిద్దిపేట సీపీ శ్వేత

CP Shwetha on attack on kotha prabhakar reddy
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన కేసుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత వివరించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి కేసును విచారిస్తున్నామన్నారు. నిందితుడు రాజు సెన్షేషన్ క్రియేట్ చేయడానికే ఈ దాడి చేసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. వారం క్రితం కత్తిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ దాడిలో ఎవరి సహకారమైనా తీసుకున్నాడా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు.

అక్టోబర్ 30న సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడని, దీంతో స్థానికులు రాజును కొట్టారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించామన్నారు. దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయాలనే ప్లాన్‌తోనే కత్తి కొనుగోలు చేసి పెట్టుకున్నట్లు చెప్పారు. ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 

నిందితుడు రాజును బుధవారం కోర్టు ముందు హాజరు పరిచారు. రాజుకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. 
kotha prabhakar reddy
dubbak
BJP
BRS
Telangana Assembly Election

More Telugu News