DK Aruna: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: డీకే అరుణ కీలక ప్రకటన

DK Aruna says she will not contest from Gadwal
  • తన నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తానన్న డీకే అరుణ
  • ఎమ్మెల్యేగా పోటీ చేయనని తాను గతంలోనూ చెప్పినట్లు వెల్లడి
  • తెలంగాణవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తానన్న డీకే అరుణ

అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ బుధవారం ప్రకటించారు. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. తన గద్వాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని చెప్పారు. తమ పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు సాగుతోందని, అందుకే తన స్థానంలో బీసీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గద్వాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తాను తమ పార్టీ అభ్యర్థుల తరఫున తెలంగాణవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానన్నారు. కాగా, ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News