Nara Lokesh: ఢిల్లీకి బయల్దేరిన నారా లోకేశ్

Nara Lokesh leaves to Delhi
  • కోర్టు కేసుల గురించి న్యాయ నిపుణులతో చర్చించనున్న లోకేశ్
  • ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు
  • 14 గంటలకు పైగా కొనసాగిన చంద్రబాబు ప్రయాణం
టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీకి బయల్దేరారు. కోర్టు కేసులకు సంబంధించి ఢిల్లీలో ఆయన న్యాయ నిపుణులతో సంప్రదించనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ కేసుతో పాటు చంద్రబాబుపై ఉన్న ఇతర కేసుల గురించి కూడా సీనియర్ లాయర్లతో లోకేశ్ చర్చించనున్నారు. 

మరోవైపు, రాజమండ్రి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి ఉదయం 6 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు. ప్రయాణం దాదాపు 14 గంటలకు పైగా కొనసాగింది. దారి పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పలికారు. వాహనంపై పూలు చల్లుతూ తమ నాయకుడికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో కాన్వాయ్ విజయవాడలోకి ప్రవేశించింది. టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు స్వాగతం పలికారు.
Nara Lokesh
Telugudesam
Delhi

More Telugu News