చార్జీల విషయంలో జియో యూజర్లకు పెద్ద ఊరట
- చార్జీలు అందుబాటు ధరల్లోనే ఉంటాయని స్పష్టీకరణ
- భారతీయులు అందరికీ డేటా అందుబాటులో ఉండాలన్న అభిప్రాయం
- మరింత మంది యూజర్లను సొంతం చేసుకోవడంపై దృష్టి
కానీ, దేశంలో చందాదారుల సంఖ్యా పరంగా మొదటి స్థానంలో ఉన్న జియో మాత్రం 5జీ చార్జీల పెంపు పట్ల సముఖంగా లేదని తెలుస్తోంది. పోటీనిచ్చే ధరలు ఉండాలన్నది జియో ఉద్దేశ్యం. అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని కంపెనీ భావిస్తోంది. మరింత మంది కస్టమర్లను సొంతం చేసుకోవడంపై తమ దృష్టి ఉంటుందని జియో ప్రెసిడెంట్ మ్యాథ్యూ ఊమెన్ స్పష్టం చేశారు.
‘‘20 కోట్ల మందికి పైగా మొబైల్ కస్టమర్లు ఇప్పటికీ 2జీతోనే ఉన్నారు. వారికి డిజిటల్ సాధికారత కల్పించాలి. 2జీ ముక్త పరిశ్రమ కోసం చార్జీలు అందుబాటు ధరల్లో ఉండాల్సిందే’’ అని ఊమెన్ తెలిపారు. భారతీయులు అందరికీ డేటా యాక్సెస్ ఉండాలని, డేటాని వారికి దూరం చేయబోమని స్పష్టం చేశారు. జియో సగటు యూజర్ నుంచి పొందుతున్న ఆదాయం రూ.181.70గా ఉంది. ఎయిర్ టెల్ కు రూ.200 చొప్పున వస్తుండగా, వొడాఫోన్ ఐడియా రూ.142 చొప్పున ఒక్కో యూజర్ నుంచి పొందుతోంది. దీన్ని రూ.300కు తీసుకెళితేనే పరిశ్రమ మనుగడ సాగిస్తుందని ఎయిర్ టెల్ అంటోంది.