kotha prabhakar reddy: యశోద ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

CM KCR visited yashoda hospital
  • కొత్త ప్రభాకర్ రెడ్డికి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్
  • వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
  • కొత్త ప్రభాకర్ రెడ్డికి ముగిసిన ఆపరేషన్

కత్తి దాడికి గురై, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఆయనకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభ అనంతరం కేసీఆర్ నేరుగా యశోద ఆసుపత్రికి చేరుకొని, పరామర్శించారు.

మరోవైపు, కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు ఆపరేషన్ జరిగింది. పేగుకు గాయం కావడంతో ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఐసీయూలో ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆపరేషన్ సమయంలో గాయం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News