Ambati Rambabu: జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది... మరి పవన్ కు...?: అంబటి రాంబాబు

Ambati Rambabu satirical tweet on Jnaneswar resignation
  • తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయం
  • పోటీ చేయాల్సిందేనన్న తెలంగాణ టీడీపీ నేతలు
  • ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ హైకమాండ్ నిర్ణయించగా, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ తెలంగాణ టీడీపీ నేతలు పట్టుబట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, అటు అధిష్ఠానానికి, ఇటు తెలంగాణ టీడీపీ నేతలకు మధ్య తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నలిగిపోయారు. తెలంగాణ టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాసాని జ్ఞానేశ్వర్ ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది... పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇటీవల కూడా అంబటి... తెలంగాణలో చేతులెత్తేసిన తెలుగుదేశం... త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అంటూ ఎద్దేవా చేశారు.
Ambati Rambabu
Kasani Jnaneswar
TDP
Telangana
Pawan Kalyan

More Telugu News