Kerala Bomb Blast: కేరళ వరుస బాంబు పేలుళ్ల ఘటన.. నిందితులు ఆ కారులోనే పారిపోయారా?

Police Identified Blue Colour Car After Kerala Bomb Blast
  • ఓ కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశమైన 'జెహోహా విట్నెసెస్'  మతగ్రూపు సభ్యులు
  • మూడుకు పెరిగిన మృతుల సంఖ్య
  • ఉగ్రకోణంపై ఎన్ఐఏ దర్యాప్తు

కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్లు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశాయి. ఎర్నాకుళం జిల్లా కులమస్సేరిలోని 'జెహోహా విట్నెసెస్' అనే క్రైస్తవ మతగ్రూపు సభ్యులు సమావేశమైన జమ్రా ఇంటర్నేషన్ కన్వెన్షన్ సెంటర్లో నిన్న జరిగిన వరుస పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. మరో 45 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉగ్రకోణంపై అనుమానం వ్యక్తం చేసింది.

తాజాగా, ఈ పేలుడుకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పేలుడు అనంతరం పోలీసులు 70కిపైగా పుటేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ నీలం రంగు కారు అనుమానాస్పదంగా కనిపించింది. పేలుడుకు కొన్ని సెకన్ల ముందు ఈ కారు కన్వెన్షన్ సెంటర్ పార్కింగ్ నుంచి వెళ్లిపోయింది. ఈ కారులోనే నిందితులు పరారైనట్టు అనుమానిస్తున్నారు. దీనికితోడు కారు నంబరు కూడా తప్పుగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది.

  • Loading...

More Telugu News