యువతి గొంతు కోసి చంపి.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
- హైదరాబాద్ లోని చంపాపేట్ లో ఓ యువకుడి ఘాతుకం
- అన్నాచెల్లెళ్లమంటూ గది అద్దెకు తీసుకున్నారన్న యజమాని
- యువతితో పాటు మరో యువకుడి మకాం
- అన్న మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోయేవాడని వెల్లడి
ఈ క్రమంలో శనివారం ఉదయం ఏం జరిగిందో ఏమో కానీ, ప్రేమ్ కుమార్ అనే యువకుడు గదిలోని యువతి గొంతు కోసి హత్య చేశాడు. ఆపై బంగ్లా పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.