State Election Commission: కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌పై ఎన్నికల సంఘం బదిలీ వేటు

EC transfer Karimnagar collector and police commissioner
  • కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడును బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
  • మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో... కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌పై బదిలీ వేటు వేసింది. ఈసీ ఆదేశాల మేరకు కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడును బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని పేర్కొన్నారు. అయితే ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News