మీతో నన్ను నేను పోల్చుకోవడమా?.. నెవ్వర్.. రజనీకాంత్ ఎక్స్‌కు అమితాబ్ రిప్లై
- రజనీకాంత్ 170వ సినిమాలో అమితాబ్‌బచ్చన్
- తలైవర్‌కు అర్థం చెప్పిన బాలీవుడ్ బిగ్‌బీ
- రజనీతో పనిచేయడం తనకు లభించిన గౌరవమన్న అమితాబ్
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజనీకాంత్ 170వ సినిమాకు రెడీ అయిపోయారు. ‘జైభీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కేరళలోని తిరువనంతపురం అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది.