World Cup: బ్యాటింగ్ స్వర్గధామంలో మ్యాచ్... వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ ఢీ

South Africa won the toss and chose batting first against Bangladesh
  • ఆసక్తికరంగా సాగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్
  • అడపాదడపా సంచలనాలతో రంజుగా సాగుతున్న టోర్నీ
  • నేడు వాంఖెడేలో దక్షిణాఫ్రికా × బంగ్లాదేశ్ 
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. టోర్నీలో ఒకటీ అరా సంచలనాలు నమోదు కావడం మామూలే. కానీ భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటికి మూడు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్... ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్థాన్ లను మట్టి కరిపించి ప్రకంపనలు సృష్టించింది. అటు, నెదర్లాండ్స్ కూడా దక్షిణాఫ్రికాను ఓడించి ఔరా అనిపించింది.

ఈ నేపథ్యంలో, నేడు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మొన్న ఇదే మైదానంలో దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్ పై పరుగుల వెల్లువ సృష్టించింది. మరోసారి అదే రీతిలో విజృంభించాలని సఫారీలు భావిస్తున్నారు. 

పాయింట్ల పట్టిక చూస్తే... దక్షిణాఫ్రికా 4 మ్యాచ్ ల్లో 3 విజయాలతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 4 మ్యాచ్ ల్లో 1 విజయం మాత్రమే సాధించింది. బంగ్లాదేశ్ కు ఈ మ్యాచ్ చాలా కీలకం. బ్యాటింగ్ కు స్వర్గధామంలా ఉన్న వాంఖెడే మైదానంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో సఫారీలను బంగ్లా బౌలర్లు ఎలా కట్టడి చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News