Vijay: విజయ్ 68వ సినిమా లాంచ్ .. ఆసక్తిని రేపుతున్న తారాగణం!

Vijay New Movie Update
  • ఇటీవలే విడుదలైన విజయ్ 'లియో'
  • 68వ సినిమాతో సెట్స్ పైకి వెళ్లిన విజయ్ 
  • దర్శకత్వం వహిస్తున్న వెంకట్ ప్రభు
  • 'బిగిల్' నిర్మాతల ప్రాజెక్టు ఇది 
  • కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్
విజయ్ 67వ సినిమాగా రూపొందిన 'లియో' ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ తరువాత సినిమాను విజయ్ సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. ఆయన 68వ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

కల్పాతి అఘోరామ్ .. గణేశ్ .. సురేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'బిగిల్' (విజిల్) తరువాత ఈ బ్యానర్లో విజయ్ చేస్తున్న సినిమా ఇది. వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ .. ఎమోషన్స్ ప్రధానంగానే రూపొందుతున్న ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. 

భారీతారాగణం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యమైన పాత్రలను పోషించే వారి జాబితాలో ప్రభుదేవా ... ప్రశాంత్ .. మోహన్ .. జయరామ్ .. స్నేహ .. లైలా .. ప్రియాంక అరుళ్ మోహన్ .. మీనాక్షి చౌదరి .. యోగిబాబు .. వీటీవీ గణేశ్ కనిపించనున్నారు.
Vijay
Priyanka Arul Mohan
Sneha
Prabhudeva
Yogi Babu

More Telugu News