Guntur Kaaram: మహేశ్ బాబు 'గుంటూరు కారం' నుంచి తొలి పాటకు రంగం సిద్ధం

Update from Mahesh Babu Guntur Kaaram
  • మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో 'గుంటూరు కారం'
  • దసరా సందర్భంగా ఆసక్తికర పోస్టర్ విడుదల
  • మరోసారి ఊర మాస్ లుక్ లో మహేశ్ బాబు
  • మహేశ్ ఫ్యాన్స్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన చిత్రబృందం

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' చిత్రం నుంచి దసరా వేళ ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. మరోసారి మహేశ్ బాబు ఊర మాస్ లుక్ ను పంచుకున్న చిత్రబృందం... 'గుంటూరు కారం' నుంచి త్వరలోనే తొలి పాట విడుదల కానుందని అభిమానులకు ఆసక్తికర కబురు వెల్లడించింది. మహేశ్ బాబు ఫ్యాన్స్ కు దసరా శుభాకాంక్షలు తెలిపింది. 

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న 'గుంటూరు కారం' చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

  • Loading...

More Telugu News