Chandrababu: చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ... భద్రతకు ఢోకా లేదు: డీజీపీ

AP DGP on chandrababu naidu letter
  • చంద్రబాబు లేఖ వ్యవహారంపై నిజానిజాలు తేలాక చర్యలు ఉంటాయన్న డీజీపీ
  • భువనేశ్వరి యాత్ర కోసం ఇప్పటి వరకు అనుమతి తీసుకోలేదని వెల్లడి 
  • టీడీపీ ఆందోళనలను తాము అడ్డుకోవడం లేదని స్పష్టీకరణ
  • చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల
  • చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నట్లు నివేదిక

రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబు లేఖ వ్యవహారంపై డీజీపీ రాజేంద్రనాథ్ స్పందించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. ఇందులో నిజానిజాలు తేలాలని, ఆ తర్వాతే చర్యలు ఉంటాయన్నారు. రాజమండ్రి కేంద్రకారాగారంలో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నారా భువనేశ్వరి యాత్ర కోసం టీడీపీ ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని డీజీపీ తెలిపారు. టీడీపీ ఆందోళనలను పోలీసులు అడ్డుకుంటున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. వారు శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసులు అడ్డుకోవడం లేదని తెలిపారు.

చంద్రబాబు ఆరోగ్యంపై బులిటెన్ విడుదల

రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు హెల్త్ బులెటన్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. జైలు వైద్య అధికారులు, రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య అధికారుల బృందం కారాగారంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News