Cyclone: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం

IMD says depression turns inti cyclone next 6 hours
  • బంగాళాఖాతంలో తుపాను పరిస్థితులు
  • తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
  • ఉత్తర వాయవ్య దిశగా బంగ్లాదేశ్ తీరం వైపు పయనం
  • ఈ నెల 25 సాయంత్రం తీరం చేరనున్న తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరింత శక్తిని పుంజుకుని తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

ఈ సాయంత్రానికి తుపానుగా మారి... ఉత్తర వాయవ్య దిశలో బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని తెలిపింది. ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా-చిట్టగాంగ్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ వివరించింది. 

కాగా, విశాఖ వాతావరణ కేంద్రం కూడా దీనిపై అప్ డేట్ అందించింది. కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
Cyclone
Deep Depression
Bay Of Bengal
IMD
Bangladesh

More Telugu News