Chellapandi: సోనీ లివ్ కి నయనతార 'పెబ్బల్స్' మూవీ .. దర్శకుడికి ఎదురైన అనుభవమే ఈ కథ! 

Pebbles movie OTT release date confirmed

  • తమిళంలో రూపొందిన 'పెబ్బల్స్'
  • వస్తావా సంఘటనలో నుంచి పుట్టిన కథ 
  • నయనతార సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా 
  • ఈ నెల 27 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్  

సాధారణంగా ఒక సినిమా విడుదలైన ఒక నెల తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది 'పెబ్బల్స్' అనే తమిళ సినిమా, రెండేళ్ల తరువాత ఓటీటీకి రావడానికి రెడీ అవుతోంది. నయనతార - విఘ్నేశ్ శివన్ సొంత బ్యానర్ పై నిర్మితమైన సినిమా ఇది. 2021 లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. 

థియేటర్స్ లో రిలీజ్ కాని ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్ కానుంది. చెల్లపాండి - కరుత్తాడియన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, వినోద్ రాజ్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, అనేక అవార్డులను గెలుచుకుంది.

తాగుబోతు భర్త వలన కష్టాలు పడలేని ఓ ఇల్లాలు తన కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ భర్త ఆమెను తీసుకురావడానికిగాను కొడుకును వెంటబెట్టుకుని బయల్దేరతాడు. ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందనేదే కథ. దర్శకుడు తన అక్కకి ఎదురైన సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను తెరకెక్కించాడట. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.

  • Loading...

More Telugu News