Bengaluru: రూ. 14 లక్షలు కారులో పెట్టి బయటకెళ్తే ఊరుకుంటారా?.. ఎలా కొట్టేశారో చూడండి!

BMW Window broken by 2 men to rob nearly Rs 14 lakh cash
  • బెంగళూరులోని రద్దీ రోడ్డుపై ఘటన 
  • చాకచక్యంగా కొట్టేసిన దొంగలు
  • అద్దం పగలగొట్టి, లోపలికి దూరి చోరీ
బిజీ రోడ్డులో పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారులో ఉన్న రూ. 14 లక్షల నగదును ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా కొట్టేశారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అక్కడి సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ప్రకారం.. పార్క్ చేసిన కారు వద్దకు మాస్క్ ధరించి వచ్చిన ఓ యువకుడు పరిసరాలు గమనించాడు. ఎవరి బిజీలో వారున్నారు. హెల్మెట్ పెట్టుకుని, ముఖం కనిపించకుండా కర్చిఫ్‌తో కట్టుకున్న మరో వ్యక్తి బైక్‌పై అక్కడికొచ్చాడు. అతడు కాపలా ఉండగా యువకుడు కారు వద్దకు వెళ్లి జేబులోంచి ఏదో పరికరం తీసి డ్రైవింగ్ సీట్లోని అద్దంపై గీశాడు. ఆ తర్వాత బలంగా రెండు దెబ్బలు వేయడంతో అద్దం పగిలిపోయింది. 

ఆ వెంటనే అందులోంచి కారులోకి దూరి  డబ్బు ప్యాకెట్‌ను అందుకున్నాడు. ఆపై బైక్ ఎక్కేసి ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Bengaluru
BMW Car
Crime News

More Telugu News