మహిళలు తమ అమ్మ, అత్తమ్మకు బానిసలు కారు: కేరళ హైకోర్టు వ్యాఖ్యలు
- ఓ మహిళ విడాకుల అభ్యర్థనపై విచారణ
- అమ్మ, అత్తమ్మ చెప్పేది వినాలన్న కుటుంబ న్యాయస్థానం
- మహిళ నిర్ణయాలు ఇతరుల కంటే తక్కువేమీ కాదన్న హైకోర్టు
ఫ్యామిలీ కోర్డు ఆదేశాలను హైకోర్టు తప్పుబట్టింది. ఇవి పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉన్నట్టు పేర్కొంది. ఇది నేటి నీతి కాదంటూ, ఇది కొనసాగడానికి వీల్లేదని వ్యాఖ్యలు చేసింది. బాధిత మహిళ ఈ అంశంలో తన అమ్మ, అత్తమ్మ చెప్పేది వినాలంటూ కుటుంబ న్యాయస్థానం చెప్పిన విషయాన్ని భర్త తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. మహిళ నిర్ణయాలు, తన అమ్మ లేదంటే అత్తమ్మ కంటే తక్కువేమీ కాదని పేర్కొన్నారు. వీరి మధ్య విభేదాలు సులభంగానే, కోర్టు బయట పరిష్కరించుకోగలిగినవిగా స్పష్టం చేశారు.