దోశ వేసి ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ
- జగిత్యాల జిల్లాలో ప్రచారం సందర్భంగా కనిపించిన దృశ్యం
- నేటితో తెలంగాణలో మూడో రోజుకు చేరిన పర్యటన
- నేడు ఆర్మూరులోనూ విజయభేరి యాత్ర
పెనంపై పిండి వేసి, మసాలా దోశ తయారు చేశారు. తాను సైతం దోశ వేయగలనని నిరూపించుకున్నారు. రాహుల్ చర్య స్థానికులను ఆకర్షించింది. హోటల్ నిర్వాహకుడికి ఎంత ఆదాయం వస్తోంది, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో రాహుల్ యాత్ర మూడో రోజుకు చేరుకుంది. గురువారం రాత్రి కరీంనగర్ లో బస చేసిన ఆయన, శుక్రవారం ఉదయం జగిత్యాలకు ప్రయాణమయ్యారు. విజయభేరి బస్సు యాత్రలో భాగంగా నేడు ఆర్మూరులోనూ రాహుల్ పర్యటించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.