పుతిన్ కు అవమానం.. ఆయన ప్రసంగిస్తుండగా వాకౌట్ చేసిన యూరప్ ప్రతినిధులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుతిన్ కు అవమానం.. ఆయన ప్రసంగిస్తుండగా వాకౌట్ చేసిన యూరప్ ప్రతినిధులు

European delegates walks out during Putin speech
  • చైనా నిర్వహించిన అతి పెద్ద దౌత్య కార్యక్రమంలో ఘటన
  • జిన్ పింగ్ మాట్లాడిన తర్వాత ప్రసంగించిన పుతిన్
  • ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు పరాభవం ఎదురయింది. ఆయన ప్రసంగించడాన్ని మొదలు పెట్టగానే యూరప్ ప్రతినిధులు వాకౌట్ చేశారు. బీజింగ్ లో చైనా నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిలియన్ డాలర్ల బెల్ట్, రోడ్ ప్రాజెక్టు కోసం ఈ అతిపెద్ద దౌత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధ్యక్షతన బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. 

ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ కు ఇదే తొలి విదేశీ పర్యటన. తనతో పాటు అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించిన బ్రీఫ్ కేస్ ను కూడా పుతిన్ తీసుకెళ్లారు. జిన్ పింగ్ మాట్లాడిన తర్వాత పుతిన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ప్రసంగాన్ని మొదలు పెట్టగానే ఐరోపా ప్రతినిధులు వాకౌట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Putin
Russia
China
Europe
Delegates

More Telugu News