Ambati Rambabu: ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎందుకురా జోకులేసి చంపుతారు!: మంత్రి అంబటి

Ambati tweets on latest developments in state
  • తాజా రాజకీయ పరిణామాలపై అంబటి ట్వీట్
  • బాబు అరెస్ట్ వార్త విని మరణించారనడం ఓ జోక్ అన్న అంబటి
  • మరణించినవారిని పరామర్శించడానికి వెళ్లడం మరో జోక్ అంటూ వ్యంగ్యం 
ఏపీ మంత్రి అంబటి రాంబాబు తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. బాబు అరెస్ట్ వార్త విని మరణించారనడం ఓ జోక్ అని కొట్టిపారేశారు. మరణించినవారిని పరామర్శించడానికి వెళ్లడం మరో జోక్ అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎందుకురా జోకులేసి చంపుతారు? అంటూ అంబటి రాంబాబు ఎక్స్ లో స్పందించారు. అయితే అంబటి ట్వీట్ పట్ల నెట్టింట మిశ్రమ స్పందన వస్తోంది. గతంలో వైఎస్సార్ చనిపోయినప్పుడు కూడా చాలామంది మరణించడం, వారిని ఓదార్చడం కూడా జోకేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Ambati Rambabu
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News