Congress: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డులకు రామప్ప ఆలయంలో పూజలు చేసిన రాహుల్, ప్రియాంక

Rahul Gandhi and Priyanka visits Ramappa temple andm offered prayers
  • నేడు ములుగులో కాంగ్రెస్ ఎన్నికల సభ
  • హాజరైన రాహుల్ గాంధీ, ప్రియాంక
  • సభకు వచ్చే ముందు రామప్ప ఆలయ సందర్శన
తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఓవైపు అధికార బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలతో జోరు పెంచగా, కాంగ్రెస్ పార్టీ కూడా పోటాపోటీగా సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నేడు ములుగులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. 

కాగా, ఈ సభకు వచ్చే ముందు రాహుల్, ప్రియాంక ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో తమ ప్రచార అస్త్రాలుగా పేర్కొంటున్న ఆరు గ్యారెంటీ కార్డులను రామప్ప ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ములుగు సభకు బయల్దేరారు. 1.మహాలక్ష్మి 2. రైతు భరోసా 3. గృహజ్యోతి 4. ఇందిరమ్మ ఇళ్లు 5. యువ వికాసం 6. చేయూత గ్యారెంటీలను ఇటీవల కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Congress
Rahul Gandhi
Priyanka Gandhi
Ramappa Temple
Mulugu
Telangana

More Telugu News