Israel Hamas war: గాజా ఆసుపత్రిలో అకస్మాత్తుగా పేలుడు.. 500 మందికిపైగా దుర్మరణం

Gaza authorities say hundreds killed in Israeli air raid on hospital
  • నగరంలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో అకస్మాత్తుగా పేలుడు
  • ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని హమాస్ ఆరోపణ
  • ఘటనకు సంబంధించి తమ వద్ద ఏ సమాచారం లేదన్న ఇజ్రాయెల్
  • దాడిని ఖండించిన డబ్ల్యూహెచ్ఓ, ఈజిప్ట్, కెనడా
గాజాలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి అల్ అహ్లీ ఆసుపత్రిలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఏకంగా 500 మంది మరణించారు. ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందంటూ హమాస్ ఆరోపిస్తోంది. యూదు దేశం యుద్ధ నేరానికి పాల్పడిందని మండిపడింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి తమ వద్ద ఏ సమాచారం లేదని ఇజ్రాయెలీ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. వైమానిక దాడి జరిగిందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. కాగా, ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.   

ఈ ఘటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. సామాన్య పౌరుల రక్షణకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈజిప్ట్, కెనడా కూడా ఈ దారుణాన్ని ఖండించాయి.
Israel Hamas war
Gaza
Israel

More Telugu News