World Cup: దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ 43 ఓవర్లకు కుదింపు

Overs reduced to 43 in South Africa and Nederlands clash
  • వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా × నెదర్లాండ్స్
  • ధర్మశాలలో వర్షం... ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ధర్మశాలలో వర్షం కారణంగా మ్యాచ్ దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు మాక్స్ ఓడౌడ్ 17, విక్రమ్ జిత్ సింగ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
World Cup
South Africa
Nederlands
Dharmashala

More Telugu News