Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

SC may give judgment on chandrababu petition on friday
  • స్కిల్ కేసులో ముగిసిన ఇరువైపుల వాదనలు
  • అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామన్న చంద్రబాబు లాయర్
  • విజ్ఞప్తిని మన్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఇరువైపుల వాదనలను వింది. ఈ రోజు విచారణ ముగియడంతో తీర్పును వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని, ఆయన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, ఈ నేపథ్యంలో 73 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తికి తీర్పు వచ్చేవరకు మధ్యంతర  బెయిల్ ఇవ్వాలని హరీశ్ సాల్వే కోరారు. అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని ఆయన విజ్ఞప్తి చేశారు. లిఖితపూర్వక వాదనలు ఏవైనా ఉంటే శుక్రవారం లోపు ఇవ్వాలని,  ఒకేసారి తుది తీర్పు ఇస్తామంటూ విచారణ ముగించారు.

ఈ క్రమంలో శుక్రవారం నాటికి చంద్రబాబు తరఫు న్యాయవాదులు, సీఐడీ తరపున న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు సమర్పించవలసి ఉంటుంది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడం మినహా శుక్రవారం వాదనలు ఉండే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.

  • Loading...

More Telugu News