World Cup: వరల్డ్ కప్: దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్ టాస్ కు వరుణుడి అడ్డంకి

Match between South Africa and Nederlands delayed due to rain
  • వరల్డ్ కప్ లో ఇవాళ సఫారీలతో డచ్ జట్టు ఢీ
  • ధర్మశాలలో వర్షం... చిత్తడిగా మారిన మైదానం
  • టాస్ ఆలస్యం

వరల్డ్ కప్ లో ఇవాళ దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ధర్మశాలలో వర్షం పడడంతో మైదానం చిత్తడిగా మారింది. అవుట్ ఫీల్డ్ ఇంకా తేమగా ఉండడంతో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. వర్షం తగ్గిందనుకునే లోపే మళ్లీ జల్లులు మొదలవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. 

కాగా, ఈ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు నిలకడైన ఆటతీరుతో దూసుకుపోతోంది. ఆ జట్టు ఇప్పటివరకు శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై విజయాలు సాధించి ఊపుమీదుంది. టాపార్డర్ లో అందరూ ఫామ్ లో ఉండగా, బౌలర్లు సైతం అంచనాల మేరకు రాణిస్తుండడం దక్షిణాఫ్రికాను ఈ టోర్నీలో బలమైన జట్టుగా మార్చేసింది. దానికితోడు సఫారీల ఫీల్డింగ్ ప్రమాణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

మరోవైపు పసికూన నెదర్లాండ్స్ తానాడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. ఇవాళ తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన దక్షిణాఫ్రికాతో ఆడుతుండడంతో ఆ జట్టు అవకాశాలు అంతంత మాత్రమే అని చెప్పాలి.

  • Loading...

More Telugu News