Vijayasai Reddy: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అన్ని సీట్లలో పోటీ చేయదట!: విజయసాయిరెడ్డి వ్యంగ్యం

Vijayasaireddy comments on TDP being contest in Telangana assembly election
  • తెలంగాణలో 87 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందన్న కాసాని
  • అభ్యర్థులు దొరకలేదా? అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యం 
  • ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణం అంటూ వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పట్టున్న 87 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతున్నామని తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అన్ని సీట్లలో పోటీ చేయదట... అభ్యర్థులు దొరకడంలేదని అనుకోవాలా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది" అని విజయసాయిరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News