Chandrababu: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏసీబీ కోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు!

Family members reaches to court on chandrababu health condition
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి నివేదిక అందించలేదన్న కుటుంబ సభ్యులు
  • తమకు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వలేదని వెల్లడి
  • 12వ తేదీ తర్వాత నిర్వహించిన పరీక్షల నివేదిక ఇవ్వలేదని కోర్టుకు తెలిపిన కుటుంబ సభ్యులు
చంద్రబాబు ఆరోగ్యం పరిస్థితిపై ఎలాంటి నివేదిక అందించలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. 12వ తేదీ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల నివేదిక ఇవ్వలేదని తెలిపారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేతను సీఐడీ గత నెలలో అరెస్ట్ చేసి, రాజమహేంద్రవరం కేంద్రకారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టీడీపీ కేడర్ ఆందోళన చెందుతోంది. 

ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు తాజాగా కోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నివేదిక ఇవ్వలేదని ఆరోపించారు. ఆరోగ్య నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ కోర్టును కోరారు. అధికారులు చెప్పిన అంశాలతోనే హెల్త్ బులెటిన్ ఇస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు.

కాగా, తమకు ఫిజికల్ డాక్యుమెంట్ అందలేదని న్యాయస్థానం తెలిపిందని చంద్రబాబు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Chandrababu
acb court

More Telugu News