America: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఆరేళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన అమెరికన్

Muslim boy 6 stabbed to death by US landlord in Illinois
  • అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ఘటన
  • దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడి తల్లి
  • బాలుడు పాలస్తీనా-అమెరికన్ కావడమే కారణమన్న పోలీసులు
  • ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అమెరికాలో ఓ చిన్నారిని బలితీసుకుంది. ఆరేళ్ల బాలుడిని 71 ఏళ్ల వృద్ధుడు పాశవికంగా పొడిచి చంపాడు. 32 ఏళ్ల మహిళను తీవ్రంగా గాయపరిచాడు. ఇల్లినాయిస్‌లో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. బాధితులు ఇస్లాంను విశ్వసించడమే అందుకు కారణమని, ఇజ్రాయెల్-హమాస్ దాడికి ప్రతిఫలంగానే ఇది జరిగిందని పోలీసులు తెలిపారు. 

వృద్ధుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మహిళకు ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది. బాలుడి శరీరంపై లెక్కలేనన్ని కత్తిగాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. నిందితుడిని జోసెఫ్ ఎం జుబాగా గుర్తించారు.

బాధితులు ఇద్దరూ ముస్లింలు కావడమే ఈ దాడికి కారణమని పోలీసులు నిర్ధారించారు. బాధితుల పేర్లను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. బాలుడు పాలస్తీనా-ముస్లిం అని అతడి మేనమామ యూసుఫ్ హనాన్ తెలిపారు. అమెరికన్ దాడిలో గాయపడిన మహిళను బాలుడి తల్లిగా గుర్తించారు.
America
Palestinian-American Boy
Illinois
Israel-Hamas War

More Telugu News