pvr: పీవీఆర్‌లో భలే ఆఫర్... రూ.700కే పది సినిమాలు చూడొచ్చు!

  • అక్టోబర్ 16 నుంచి పీవీఆర్ ఐనాక్స్‌లో రూ.700కే మంత్లీ పాస్
  • నెల రోజుల్లో మీకు ఇష్టమైన 10 సినిమాలను చూడవచ్చు
  • సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తింపు
PVR INOX movie monthly pass from 16 october

సినీ ప్రియులకు పీవీఆర్ సినిమాస్ దసరా పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. మల్టీప్లెక్స్‌లో ఓ కుటుంబం సినిమా చూడాలంటే కనీసం భారీగా ఖర్చు చేయాల్సిందే. అయితే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు పీవీఆర్ మంచి ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.700కే పది సినిమాలు చూసే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు పీవీఆర్ సినిమాస్ ప్రకటన వెలువరించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.

పీవీఆర్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ద్వారా 30 రోజులకు రూ.700 చెల్లించి ఏదైనా పీవీఆర్ థియేటర్‌లో 10 సినిమాలను చూడవచ్చు. ఈ ఆఫ‌ర్ వీక్ డేస్‌లో అంటే సోమవారం నుంచి శుక్రవారం మాత్రమే వర్తించనుంది. పీవీఆర్ ఐనాక్స్ దీనిని 'మంత్లీ మూవీ పాస్‌'గా పేర్కొంది. 

More Telugu News