జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యాడు: లంకా దినకర్
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి ఫోన్ పగిలిందన్న లంకా దినకర్
- నాసిరకం మద్యం తయారీలో మీ అల్లుడి పాత్ర లేదా? అని ప్రశ్న
- విజయసాయి మళ్లీ దిగజారుడు భాష వాడుతున్నారని విమర్శ
ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి కొంచెం సైలెంట్ అయ్యారని... జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ యాక్టివ్ అయ్యాడని విమర్శించారు. ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి భాష సంస్కారవంతంగా మారిందని... ఇప్పుడు మళ్లీ దిగజారుడు భాషను వాడుతున్నారని మండిపడ్డారు. పురందేశ్వరిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై లంకా దినకర్ విమర్శలు గుప్పించారు.