KTR: చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్ బాధ కలిగించింది: కేటీఆర్

KTR reacts to Lokesh tweet on Chandrababu health
  • జైల్లో చంద్రబాబు ఆరోగ్యానికి హాని తలపెడుతున్నారన్న లోకేశ్
  • చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్
  • కుమారుడిగా తండ్రి ఆరోగ్యం పట్ల ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసన్న కేటీఆర్
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు నారా లోకేశ్ సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే. ఏనాడూ ఏ తప్పు చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని లోకేశ్ ఆక్రోశించారు. భద్రత లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకు ప్రాణహాని తలపెడుతున్నారని, అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే ప్రణాళిక రచిస్తున్నారని ఆరోపించారు. 

లోకేశ్ ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్ బాధ కలిగించిందని అన్నారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు కూడా ఆందోళన కలిగిందని వెల్లడించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
KTR
Nara Lokesh
Chandrababu
Health
KCR
BRS
TDP
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News