Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Supreme Court adjourns Chandrababu Quash Petition to Tuesday
  • మంగళవారం మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పై విచారణ ప్రారంభం
  • ఈ కేసుకు కూడా 17ఏ వర్తిస్తుందన్న సిద్ధార్థ్ లూథ్రా
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలను వినిపించారు. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పై ఇదే బెంచ్ ముందు ప్రస్తుతం వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసుకు కూడా 17ఏ వర్తిస్తుందని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. 
Chandrababu
Telugudesam
Skill Development Case
Supreme Court
Quash Petition

More Telugu News