ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్, స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్లపై సుప్రీంలో విచారణ ప్రారంభం
- రెండు పిటిషన్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది
- చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు
- ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు
మరో కేసులో చంద్రబాబును ఈ నెల 16న కోర్టులో ప్రవేశ పెట్టేందుకు వారెంట్ తీసుకున్నారని కోర్టుకు లూథ్రా తెలిపారు. కేసులపై కేసులు పెడుతూ సర్కస్ ఆడిస్తున్నారని చెప్పారు. ప్రతి చోటా 17ఏ వర్తిస్తుందని అన్నారు. ముకుల్ రోహత్గి వాదిస్తూ... నేరం ఎప్పుడు జరిగిందో అప్పటి చట్టాలే వర్తిస్తాయని చెప్పారు. నేరం ఐదేళ్ల క్రితం జరిగినా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చని అన్నారు.