Kane Williamson: కివీస్ జట్టులోకి తిరిగొచ్చిన విలియమ్సన్... బంగ్లాదేశ్ కు బ్యాటింగ్

Kane Williamson makes comeback into team as New Zealand takes on Bangladesh in world cup today
  • వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్
  • చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
  • విలియమ్సన్ రాకతో న్యూజిలాండ్ బ్యాటింగ్ మరింత బలోపేతం
వరల్డ్ కప్ లో ఇవాళ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్ లకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులో చేరడం కివీస్ బలాన్ని రెట్టింపు చేసింది. 

విలియమ్సన్ లేకుండానే డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లను న్యూజిలాండ్ మట్టికరిపించింది. విలియమ్సన్ రాకతో కివీస్ బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుందనడంలో సందేహం లేదు. విలియమ్సన్ కోసం ఓపెనర్ విల్ యంగ్ ను తప్పించారు.

ఇక, బంగ్లాదేశ్ జట్టు ఆఫ్ఘనిస్థాన్ పై నెగ్గి, ఇంగ్లండ్ చేతిలో ఓడింది. నేడు కివీస్ తో మ్యాచ్ లో విజయం కోసం బంగ్లాదేశ్ సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో సందేహం లేదు. అయితే, కివీస్ జట్టులో అణువణువు విజయకాంక్షతో రగులుతున్న ఆటగాళ్లుండగా, బంగ్లాదేశ్ ఏ మేరకు పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Kane Williamson
New Zealand
Bangladesh
Chennai
World Cup

More Telugu News