World Cup: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఉర్రూతలూగించే సంగీత కార్యక్రమం

BCCI will organise massive music concert before India and Pakistan world cup match start
  • అక్టోబరు 14న భారత్, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్
  • అహ్మదాబాద్ లో మ్యాచ్
  • భారీగా సన్నాహాలు చేస్తున్న బీసీసీఐ
  • ప్రఖ్యాత గాయకులతో మ్యూజిక్ కాన్సెర్ట్
చిరకాల ప్రత్యర్థులు, పైగా దాయాదులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు వరల్డ్ కప్ టోర్నీలో తలపడుతుంటే ఆ మజాయే వేరు. అక్టోబరు 14న ఈ రెండు జట్లు అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనున్నాయి. దాంతో క్రికెట్ వర్గాలు ఈ మ్యాచ్ కోసం అమితాసక్తితో ఎదురుచూస్తున్నాయి. కాగా, ఈ పోరు కోసం బీసీసీఐ కూడా భారీగా సన్నాహాలు చేస్తోంది. 

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ సంగీత కచేరీ ఏర్పాటు చేస్తోంది. సుఖ్విందర్ సింగ్, శంకర్ మహదేవన్, అరిజిత్ సింగ్ వంటి గాయకులతో సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. అక్టోబరు 14న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంగీత కచేరీ ఉంటుందని తెలిపింది.
World Cup
Team India
Pakistan
Narendra Modi Stadium
Music Concert
BCCI
Ahmedabad

More Telugu News