Nara Brahmani: ఏపీలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో గ్రహించండి: నారా బ్రాహ్మణి ఘాటు వ్యాఖ్యలు

  • స్కిల్ ప్రాజెక్టు, ఫైబర్ నెట్ ప్రాజెక్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రజల కోసం తలపెట్టిన పనులన్న బ్రాహ్మణి
  • వీటినే వైసీపీ నేరాలు అంటోందని ఆవేదన
  • సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిలదీసినందుకు అంగళ్లు కేసు పెట్టారన్న బ్రాహ్మణి
  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే చంద్రబాబును జైల్లో పెట్టినట్లుగా ఉందని వ్యాఖ్య
Nara Brahmani on democracy in andhra pradesh

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అందరూ గ్రహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు ప్రజల కోసం తలపెట్టిన పనులు అన్నారు. వీటినే ఈ వైసీపీ నేరాలు అంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్ళు కేసు పెట్టారని ఆరోపించారు.

చంద్రబాబు మీద పెట్టిన కేసులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినందుకే ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా ఉందన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఉపయోగపడే పని చేయడం తప్పు అనే స్థాయికి రాజకీయం దిగజారిందంటే ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో తెలుసుకోవాలన్నారు.

More Telugu News