తిరుపతి రోడ్లపై 'డబుల్ డెక్కర్' పరుగులు... పచ్చజెండా ఊపిన టీటీడీ చైర్మన్
- తిరుపతి నగరపాలక పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులు
- విద్యుచ్ఛక్తితో నడిచే బస్సులు
- నాలుగు వేర్వేరు రూట్లలో డబుల్ డెక్కర్ ఇ-బస్సులు
ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ డి.హరిత మాట్లాడారు. స్థానికులకు, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు డబుల్ డెక్కర్ బస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఏపీలో తొలిసారిగా ఓ నగరపాలక పరిధిలో డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఈ బస్సులో ప్రయాణించే వారికి సరికొత్త అనుభూతి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
కాగా, ఇవి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు. వీటిని తిరుపతిలోని నాలుగు ప్రధాన రూట్లలో నడపనున్నారు. ప్రస్తుతం ఒక బస్సును నడిపి, మలివిడతలో మిగతా డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.